Breaking News

Loading..

సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి.ఎస్ఎఫ్ఐ.

బిసిఎం10 న్యూస్ సెప్టెంబర్ 2 భద్రాచలం

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు మేధావులు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్న కనీసం విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లో విఫలమైందన్నారు. అద్దె భవనంలో ఉంటున్న గురుకుల పాఠశాలల కు సొంత భవనాలు నిర్మించాలన్నారు. పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని, భద్రాచలం కేంద్రం గా ఉన్న జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ఖాళీగా ఉన్న డీఈఓ ఎంఈఓ పోస్ట్ భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంపత్ చందర్రావు కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 


For Advt Contact www.bcm10news.in. 9000790313 

Post a Comment

0 Comments